జీవో.317 బాధితులకు అండగా ఉంటా జగిత్యాలలో నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం
- *317 జీ.వో బాధితులకు అండగా ఉంటా..*
- *పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి పెద్దన్న పాత్ర పోషిస్తా...*
- *టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం ఉచిత యాప్*
- *జగిత్యాల పట్టణంలో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం*
*జగిత్యాల*
: రాష్ట్రవ్యాప్తంగా 317 జీవో ప్రకారం ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను స్థానికతను దృష్టిలో ఉంచుకొని వారి సొంత జిల్లాలకు బదిలీ చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తానని పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు... మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పలువురు పట్టబద్ధులను, న్యాయవాదులను, పెన్షనర్లను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టభద్రులు , నిరుద్యోగులు ప్రైవేటు యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు *ఉచిత యాప్* రూపొందించి వారికి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు.. ప్రైవేటు విద్యాసంస్థల నుండి ఒక విద్యావేత్తగా తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని.. ప్రైవేటు యాజమాన్యాల హక్కుల పోరాటానికి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని అన్నారు.. గతంలో గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు రాజకీయాలకే పరిమితమయ్యారని..ఉద్యోగ నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని.. రాజకీయ పునరావసం కోసమే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని.. గెలిచిన తర్వాత పట్టభద్రుల సమస్యలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు... తనను ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు *హెల్త్ కార్డ్స్ తో పాటు, వారి యాజమాన్యాలతో మాట్లాడి వారికీ (MBS ) *మినిమం బేసిక్ శాలరీ అమలుకు* కృషి చేస్తానని అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకై కృషి చేస్తానని అన్నారు.. ఔట్సోర్సింగ్,,పార్ట్ టైం, గెస్ట్ లెక్చరర్ లకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 010 పద్దు ద్వారా జీతాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు... *అడ్వకెట్ ప్రొటెక్షన్ యాక్ట్* అమలు కు కృషి చేస్తానని అన్నారు..చాలా చోట్ల కోర్టు భవనాలలో మౌళీక సదుపాయాలు లేక శిథిలావస్థలో ఉన్నాయని.. కొన్నిచోట్ల అద్దె భవనాల్లో కోర్టులు నడుస్తున్నాయని.. న్యాయవాద వృత్తిలోకి విచ్చేస్తున్న యువ న్యాయవాదులకు ప్రభుత్వం తరఫున5 వేల గౌరవ వేతనం ఇప్పించెందుకు కృషి చేస్తానని అన్నారు... ఓటు నమోదు చేసుకొని పట్టభద్రులకోసం నవంబర్ 23 నుండి డిసెంబర్ 09 వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించిందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు... రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు...