బీర్పూర్ మావోయిస్టు నారాయణ రావు అరెస్ట్
బీర్పూర్ మావోయిస్ట్
'బల్మూరి' అరెస్ట్
నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతవాసం
ఉలిక్కిపడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా
జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్,23
మావోయిస్టు పార్టీ మరోసారి తీవ్రంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉలిక్కిపడింది.ఆ పార్టీ అంతర్జాతీయ కమిటీ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కి వరుసకు చిన్న బాపు అయినా బల్మూరి నారాయణరావు అలియాస్ ప్రభాకర్ చత్తీస్గడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా పోలీసులకు పోలీసులకు చిక్కడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక్కసారి నివ్వరపోయింది. బీర్పూర్ గ్రామం నుండి పీపుల్స్ వార్ పార్టీలో చేరిన గణపతి ఆయన బంధువు బల్మూరి నారాయణరావు, ఎన్కౌంటర్లో మరణించిన అంగవోదలు పలువురు నాయకులుగా ఉన్నారు.రెండు రోజుల క్రితం ప్రభాకర్ రావు కాంకేర్ జిల్లాలో చిక్కినట్లు దానిని అధికారికంగా ఇక పోలీసుల ధ్రువీకరిస్తూ అరెస్ట్ చేశామని ప్రకటించడంతో గణపతి బంధువు అరెస్టు నిర్ధారించబడింది. బల్మూరు నారాయణరావు బీర్పూర్, ధర్మపురి లలో చదువుకుని ఇంటర్ పూర్తి చేశాక అజ్ఞాతవాసం వెళ్లిన విషయం చాలా కాలానికి కూడా వెలుగులోకి రాలేదు. 40 ఏళ్లుగా అజ్ఞాతవాలో ఉన్న నారాయణరావు బస్తర్ , మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో పోలీసులు నారాయణరావు కోసం తెలంగాణ ప్రాంతం నుండి దండకారణ్య ప్రాంతానికి వెళ్లిన తొలి తరం యువ నాయకుల్లో ఒకరు. వివిధ రాష్ట్రాల్లో ఆయన తలపై పెద్ద ఎత్తున రివార్డ్ ఉన్నది. గణపతికి బంధువు కావడం బీర్పూర్ గ్రామం నుండి అజ్ఞాతవాసం వెళ్లడం వలన జాతీయ స్థాయిలో నిఘా సంస్థలు నారాయణరావు కదలికలపై దృష్టి సారించి పట్టుకోగలిగారు. ఇటీవల చతిస్గడ్ మహారాష్ట్ర ముఖ్యంగా భాస్థార్ ,అబూజమాడు ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోతున్నది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్లు చీమల నరసయ్య, రానాపూర్ కు చెందిన ఏ గోల కనకయ్య, మంథని ప్రాంతాలు చెందిన శ్రీధర్, కాజీపేట కు చెందిన ఏసోబు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మోహన్ రావు ఎన్కౌంటర్లలో మరణించడం.. ఇప్పుడు తాజాగా బల్మూరి నారాయణరావు పోలీసులకు చిక్కడ0 సంచలనంగా మారింది. పోలీసులు నారాయణరావు అరెస్టుతో ఉమ్మడి జిల్లా సీనియర్ నక్సలైట్ల నుండి మరొకరు ఆ పార్టీకి దూరమయ్యారని చెప్పవచ్చు.
ఉమ్మడి జిల్లాలో మిగిలిన అగ్ర నేతలు వీరే
అంతర్జాతీయ విప్లవకారుల సమన్వయ కమిటీ సెక్రటరీగా జగిత్యాల జిల్లా బీర్పూర్ కు చెందిన ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి కొనసాగుతున్నారు. సి ఆర్ బి సెంట్రల్ రీజినల్ బ్యూరో సెక్రటరీగా పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న కొనసాగుతున్నారు. కేంద్ర కమిటీ పోలీట్ బ్యూరో లో మల్లుజుల వేణు గోపాల్ రావు, కేంద్ర కమిటీ మరో సభ్యుడు తిరుపతి, కేంద్ర కమిటీలో కోస అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి. హుస్నాబాద్ ప్రాంతం నుండి రాంచంద్రారెడ్డి, కంకిడి సత్యనారాయణ రెడ్డి, మల్లారాజిరెడ్డి మీరంతా కేంద్ర కమిటీలో ఉన్నారు. పీపుల్ సార్ పార్టీగా ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో కేంద్ర కమిటీలో ఉమ్మడి జిల్లా వారు కేంద్ర కమిటి లో పెద్ద సంఖ్యలో ఉండేవారు. ఎన్కౌంటర్లు లొంగుబాట్ల దెబ్బకు ఆ సంఖ్య సగానికి సగం పడిపోయింది
మావోయిస్టు నారాయణరావు అలియాస్ ప్రభాకర్ ధర్మపురిలో విద్యాభ్యాసం !
నాలుగు దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో కొనసాగుతూ మావోయిస్టు పార్టీ లో కీలక నేతగా ఎదిగిన బల్మూరి నారాయణరావు అలియాస్ ప్రభాకర్ బిర్పూర్ లో ప్రాథమిక విధ్య అభ్యసించి,ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరాడు.
మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు @ గణపతి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.
1982 83లో ఇంటర్ చదువుతుండగా రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో విద్యార్థి నారాయణరావు కోసం గాలిస్తుండగా అజ్ఞాతంలోకి వెళ్ళనట్లు సమచారం.
బల్మ్యూరి నారాయణ రావు ది సామాన్య కుటుంబం..
వెలమ సామాజిక వర్గం బీర్పూర్ కు చెందిన బల్మూరి నారాయణరావు అలియాస్ ప్రభాకర్ ది సామాన్య కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు తోబుట్టువులు గల పెద్ద కుటుంబం. నారాయణరావు చిన్నవాడు, వెంకట్రావు సోదరుడు సింగిల్ విండో సెక్రెటరీగా పనిచేసేవాడు. మరో సోదరుడు రామారావు అనారోగ్యంతో చనిపోయాడు. తల్లిదండ్రులు కిషన్ రావు, సుశీలమ్మ, నారాయణరావు ఆచూకీ కోసం పదేపదే పోలీసులు మీరి ఇంటికి వచ్చి వేధించడంతో సోదరుడు వెంకట్రావు తన గత 20 సంవత్సరాల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి కరీంనగర్ లో జీవనం కొనసాగిస్తున్నాడు.
పోటా పోటీగా స్థూపాలు....
మావోయిస్టు అగ్రి నేత గణపతి స్వగ్రామం బీర్పూర్ కావడంతో ఇక్కడ మావోయిస్టులు బస్టాండ్ లో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు.
దీనికి పోటీగా పోలీస్ యంత్రాంగం ధర్మ పురి వైపు ఉన్న మరో బస్టాండ్ లో శాంతి స్థూపం నిర్మించారు.
సీనియర్ మావోయిస్టు ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావుస్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు
ర్యాంక్ మావోయిస్ట్ ని కంకేర్ పోలీసులు అరెస్టు చేశారు.
సీనియర్ మావోయిస్టు నాయకుడు ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావు 1984లో నక్సల్ పార్టీ సభ్యునిగా రిక్రూట్ అయ్యి గత 40 ఏళ్లుగా చురుకుగా పనిచేస్తున్నారు. గత కొన్నీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ రావు పార్టి సానుభూతి పరుల వద్ద ఉండి చికిత్స తీసుకుంటుండగా పోలిసుల అదుపులోకి తీసుకుని వెళ్ళగా మావోయిస్టు పార్టీ ప్రభాకర్ ను అరెస్టు చూపెట్టి కోర్టు లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.
*సీనియర్ మావోయిస్టు క్యాడర్ ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావు ఎస్ సి జడ్ ర్యాంక్ నక్సలైట్‌ని కంకేర్ పోలీసులు అరెస్టు చేశారు.*
యాక్టివ్ నార్త్ సబ్ జోనల్ బ్యూరోలో లాజిస్టిక్స్ సప్లై మరియు యం ఓ పి ఓ ఎస్
టీమ్ ఇంఛార్జ్ ఆని
*ప్రభాకరరావు గత 40 సంవత్సరాలుగా నక్సల్ సంస్థలో చురుకుగా పనిచేస్తున్నారు.
అరెస్టయిన టాప్ నక్సలైట్ ప్రభాకర్ రావుపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు అనేక ఇతర రాష్ట్రాల్లో డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి.
లాజిస్టిక్ సప్లై మరియు లాజిస్టిక్ ఇంచార్జ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన మావోయిస్టు అగ్ర నాయకుల సన్నిహిత సహచరుడు.
కేంద్ర కమిటీ కార్యదర్శి బసవ రాజుకు , కేంద్ర కమిటీ సభ్యుడు కె. రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, దేవ్‌జీ అలియాస్ కుమా దాదా, కోసా, సోను, మల్లరాజ రెడ్డి అలియాస్ సంగ్రామంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయినీ పోలీసులు పేర్కోన్నారు.
దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ
సభ్యుడు ప్రభాకర్ రావు అలియాస్ బాలమూరి నారాయణరావుపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.
గత కొన్ని రోజులుగా, జిల్లా కంకేర్ ప్రాంతంలో నిషేధిత మరియు చట్టవిరుద్ధమైన సీపీఐ మావోయిస్టు సంస్థకు చెందిన నార్త్ బస్తర్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన సీనియర్ మావోయిస్టు క్యాడర్ ప్రభాకర్ రావు కార్యకలాపాలు ప్రతిబింబిస్తున్నట్లు సమాచారం అందిన తరువాత, పేర్కొన్న నిఘా పోలీసు. ఇదిలా ఉండగా, ఈ నేల 22న జిల్లా కంకేర్‌లోని అంతఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జరిపిన దిగ్బంధనం ఆపరేషన్‌లో ప్రభాకర్ రావు అలియాస్ బాలమూరి నారాయణరావును అరెస్టు చేశారు. అరెస్టయిన మావోయిస్టు ప్రభాకర్ రావును నిరంతరం విచారిస్తూ ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
*బస్తర్ డివిజన్ పరిధిలో ప్రభాకర్ రావు అలియాస్ బలమూరి నారాయణరావు అరెస్ట్ నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కోణం నుండి పోలీసు శాఖకు ముఖ్యమైన విజయం,సీనియర్ మావోయిస్టు క్యాడర్ ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావు 1984లో నక్సల్ సంస్థలో పార్టీ సభ్యునిగా రిక్రూట్ అయ్యి గత 40 ఏళ్లుగా చురుకుగా పనిచేస్తున్నారు.
ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావు, వయస్సు- 57 సంవత్సరాలు*
- *నివాసి:- బీర్పూర్ గ్రామం, జిల్లా జగిత్యాల్, తెలంగాణ రాష్ట్రం*
- *1984 నుండి నక్సల్ సంస్థలో పార్టీ సభ్యునిగా చేరారు*
- *1984-1994 వరకు అవిభక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు సంస్థలో క్రియాశీలకంగా ఉన్నారు*
- *బాలాఘాట్ ప్రాంతంలో (మధ్యప్రదేశ్) 1995-1997 వరకు చురుకుగా ఉంది*
- *1998-2005 వరకు నార్త్ బస్తర్, కోయిలిబేరా ప్రాంతంలో చురుకుగా ఉన్నారు*
- *2005-2007 సంవత్సరానికి దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా
సప్లై టీమ్ & అర్బన్ నెట్‌వర్క్ యొక్క పని*
2007-2008 సంవత్సరంలో మన్పూర్-మొహాలా ప్రాంతంలో చురుకుగా ఉంద
సంవత్సరం 2008-2024 నుండి ఇప్పటి వరకు- దండకారణ్యం సెప్షల్ జోన్ కమిటి సభ్యునిగా
సరఫరా మరియు మొబైల్ పొలిటికల్ స్కూల్ ఇన్‌ఛార్జ్ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కోన్నారు