మృతదేహాన్ని అవమానపర్చిన వారిపై కేసు నమోదు

మృతదేహాన్ని అవమానపర్చిన వారిపై కేసు నమోదు

మృతదేహాన్ని అవమాణపర్చిన వారీ పై కేసు నమోదు 


చురకలు విలేఖరి 
జగిత్యాల, డిసెంబర్,25.

జగిత్యాల పట్టణంలో మంగళవారం మరణించిన సాదుల  సత్తవ్వ, భర్త: లక్ష్మన్,  తీన్ కని జగిత్యాల అనే వృద్దురాలు ఆమె యొక్క భర్త గత 20 సంవత్సరాల క్రితం మరణించిగ ,ఆమెకు సంతానం లేక ఆమె  భావ కొడుకులు సాదుల ప్రసాద్ ,సాధుల రవి అనే వారిని చేరదీసి తన యావదాస్తిని వారికి పంచి ఇవ్వగా ,తర్వాత వారు ఆమెను  వృద్ధాప్యంలో  పోషణను పట్టించుకోకుండా, ఆమె బాగోగులను చూడకుండ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సత్తమ్మ సహజ మరణం చెందినది.  ఆమె బ్రతికి ఉన్నప్పుడు కూడా వారు ఇద్దరూ అన్నదమ్ములు ఆమె యొక్క ఆస్తుల గురించి పంపకాలలో ఇద్దరు తగవు లాడుకునేదనీ,ఆమె మరణించిన తర్వాత కూడా కనీసం ఆమె యొక్క మృతదేహాన్ని వారి ఇళ్లలోకి రానివ్వకుండా అడ్డుపడి రోడ్డుపైనే అంబులెన్స్ లో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉంచి ఆమె యొక్క మృతదేహాన్ని అవమానించరాని,. ఈ విషయంపై జగిత్యాల పట్టణ పోలీసులు సుమోటోగా కేసు స్వీకరించి వారిద్దరిపై ,ఎస్సై మన్మధరావు ఆధ్వర్యంలో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు 
జగిత్యాల పట్టణ పోలీసులు పేర్కోన్నారు.IMG-20241225-WA0001

Tags: