జాతీయ సేవరత్న అందుకున్న కిషన్ రెడ్డి
*జాతీయ సేవా రత్న అందుకున్న కిషన్ రెడ్డి*
*వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందరెడ్డిచే అవార్డుల ప్రధానం*
*జగిత్యాల జిల్లాకు 6 గురికి ప్రధానం*
జగిత్యాల ప్రతినిధి ;
అంజలీ మీడియా గ్రూపు ,అందరి టీవీ 10 వ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని కాకతీయ నంది పురస్కారాల పేరిట అవార్డులను పలు రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రధానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిలో జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్న0 కిషన్ రెడ్డి కి జాతీయ సేవా రత్న, బుగ్గారం కు చెందిన డాక్టర్ నక్క రాజుకు కాకతీయ మహానంది, జాతీయ సేవా రత్న, ట్రాక్ సింగర్ గా మాన్యం రవికుమార్ కు కాకతీయ నంది, గాండ్ల మధురిమకు జాతీయ సేవా రత్న, పడాల మమతకు కాకతీయ నంది, చింత సుధీర్ కు కాకతీయ నంది,, కోరుట్ల గణేష్ కు జాతీయ సేవా రత్న లు అవార్డులు అందుకున్నారు.
హన్మంకొండలోని నెరేళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో
అంజలీ మీడియా చైర్మన్ కామిశెట్టి రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జ0గా రఘువీర్ గౌడ్,కూచన నాగ జ్యోతి,బాబా మియా, నక్క జితేందర్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.