ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ఆంధ్ర ప్రభ ఎస్పి అశోక్ కుమార్

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ఆంధ్ర ప్రభ ఎస్పి అశోక్ కుమార్

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ఆంధ్రప్రభ.

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్పీ.

జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 30 ప్రజలకు ,IMG-20241230-WA0003ప్రభుత్వానికి మధ్య వారధి ఆంధ్రప్రభ దినపత్రిక అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పాత్రికేయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆంధ్రప్రభ ముందుంటుందన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుండే ప్రచురితం అవుతున్న ఆంధ్రప్రభ దినపత్రిక నిత్యం ప్రజల అభిమానం పొందుతుందన్నారు. కాలనుగుణంగా స్మార్ట్ ఎడిషన్, ఆంధ్రప్రభ యాప్ లతో డిజిటల్ రంగంలో ఎప్పటి వార్తలు అప్పుడు అందిస్తుందన్నారు. రానున్న నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు టీవీ. సూర్యం, మోసిక్, సులేమాన్, నాజీమ్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags: