ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టు లు
జగిత్యాలలో ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పటిష్ట బందోబస్తు
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, డిసెంబర్ 31 : జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ అశోకుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ రఘుచందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మండే పోలీసులు ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని ప్రధాన కూడళ్లు కొత్త బస్టాండ్ చౌరస్తా, పాత బస్టాండ్ చౌరస్తా, మంచినీళ్లబావి. ఎస్ కెఎస్ఆర్ డిగ్రీ కళాశాల చౌరస్తా, గొల్లపల్లి రోడ్డు, టవర్ సర్కిల్ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో 1 డిఎస్పీ, 1 సీఈ, 8 మంది ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో డ్రంకన్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ రఘుచందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ లు మాట్లాడుతూ వాహనదారులు ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతరులకు ఇబ్బంది కల్గించే విధంగా డిజెలు,
భారీ శబ్దాలు వచ్చే బాక్సులు ఏర్పాటు చేయవద్దని సూచించారు. పట్టణంలోని రోడ్లపై నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేకు కట్ చేయవద్దని, ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తే
కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు కిరణ్ కుమార్, మన్మధరావు, గీత, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.