పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని అభినదించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని అభినదించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

IMG-20241231-WA0002ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలను అందుకోనున్న జిల్లా పోలీసులు.

పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని అభినదించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, డిసెంబర్ 31: విధి నిర్వహణలో భాగంగా  కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే  గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలకు అందుకోనున్న పోలీస్‌ అధికారులను జిల్లా ఎస్పీ  అభినందించారు. సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాములు ( సేవ పథకం),  స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్ రాజు ( సేవ పథకం),  సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మొయినుద్దీన్ (సేవ పథకం),  డిస్టిక్ ఆర్మ్ రిజర్వుడ్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నసీముద్దీన్ (సేవ పథకం),  డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్ లో   విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ -శంకరయ్య  (సేవ పథకం),  రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ - సయ్యద్ తకీయుద్దన్ (సేవ పథకం), 
రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పోచయ్య-(సేవ పథకం),  రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మోహన్ లాల్-(సేవ పథకం)లకు ఎంపిక కాగా వీరిని ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: