హెడ్ కానిస్టేబల్ రాములు కు ఉత్తమ సేవా పతకం

హెడ్ కానిస్టేబల్ రాములు కు ఉత్తమ సేవా పతకం

జగిత్యాల ప్రతినిధి :

జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలకు  ప్రకటించింది.
జగిత్యాల జిల్లాలో 8 మంది పోలీసులకు ఉత్తమ సేవా పథకాలకు ఎంపికయ్యారు.
పోలీస్ శాఖలోని 
వివిధ విభాగాలలో పని చేస్తున్న రాష్ట్ర పోలీసులకు (లా అండ్ ఆర్డర్, ఇంటలిజెన్స్, ఎస్బి, ఎస్ ఐ బి, ఐటీ సెల్, సీఐడి) అధికారులు, సిబ్బందిని హోం శాఖ ఎంపిక చేయాగ  జగిత్యాల డీఎస్పీకార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాములు (హెచ్.సి 136 )కు ప్రభుత్వం అందజేసే ఉత్తమ సేవా పతకం తోపాటు రూ. 30 వేల నగదు రివార్డుకు ఎంపికయ్యారు. 

విధినిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ రాములు  విధినిర్వహణలో అంఖితభావం తో పనిచేస్తుందడం వృత్తిలో నిబద్దత,ఉత్తమ ప్రతిభ కనబర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రాములును ఈ పతకానికి ఎంపిక చేశారు.

రాములు ఉత్తమ సేవా పతకానికి ఎంపిక కావడం పట్ల జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల డీఎస్పీ రఘు చందర్,జగిత్యాల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని 
సీ ఐ లు వేణుగోపాల్, కృష్ణా రెడ్డి, నీలం రవి, రాంనర్సింహరెడ్డిలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది,జగిత్యాల ప్రెస్ క్లాబ్ అధ్యక్షులు  ఎన్నం కిషన్ రెడ్డి, శుభాకాంక్షలు తెలియజేసారు.

Tags: