ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సబ్ కమిటీ, ఉద్యోగుల జేఏసీ కీ పిలవాలి
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగులకు జేఏసీ కి పిలువండి
తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమార్క డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారుడు కే కేశవరావు లకు విజ్ఞప్తి చేశారు
చురకలు విలేఖరి
హుజరాబాద్, డిసెంబర్,29
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం లో తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులకు పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సి ఎస్ శాంతకుమారి లా తో 2 04 ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని ఉద్యోగ సంఘం నాయకులకు హామీ ఇచ్చి మీ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క మంత్రులు డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారుడు కే కేశవరావు వీరి ఆధ్వర్యంలో ఈ సమస్యల పరిష్కారం కొరకు ఈ కమిటీ ముందు హాజరై మీ సమస్యలు ఒక్కొక్క శాఖకు సంబంధించినవి సమస్యలు గనుక వీరి దృష్టికి తీసుకొని వచ్చినచో ఆ సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు కానీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఈ హెచ్ ఎస్ పెండింగ్ మెడికల్ బిల్స్ జిపిఎఫ్ నాలుగు డిఏలు సిపిఎస్ రద్దు 317 జీవో కు సంబంధించిన సమస్యలపై పిఆర్సి రిపోర్ట్ రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వ ఉద్యోగుల సెటిల్మెంట్ క్యాడర్ స్ట్రెంత్ కారుణ్య నియామకాలు వంటివి అన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి కనుక ఈ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐటి ఇండస్ట్రీస్ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారుడు కె కేశవరావు వీరికి కమిటీ వేసి దాదాపు మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన సబ్ కమిటీ క్యాబినెట్ మంత్రులు ఇప్పటివరకు కూడా తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులకు సంబంధించిన సంఘ నాయకులకు పిలువలేదు ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడం ఎంత బాధాకరమైన విషయమని తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు కనుక ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులతోపాటు అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘ నాయకులు పిలిచి ఆ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారం అప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ తోపాటు అన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారులకు పిలిచి ఒకరోజు ఒక్కొక్క శాఖకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులు పిలిచినప్పుడు ఆ శాఖకు సంబంధించిన రాష్ట్రస్థాయి అధికారుల పిలిచి అధికారుల సమక్షంలోనే ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయడానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులకు పిలవాలని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రుల సమావేశం వెంటనే ఏర్పాటు చేసి అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘ నాయకులు వెంటనే పిలువాలని తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి క్యాబినెట్ మంత్రులు బట్టి విక్రమార్క డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారుడు కే కేశవరావు లకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు