న్యూఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
న్యూఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, డిసెంబర్ 31: న్యూఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన
మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, జిల్లాకేంద్రంలో 1 డిఎస్పీ, 1 సీఐ, 8 మంది ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, మండలాల్లో ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 31
సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1 ఉదయం 6 గంటల వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహిస్తామన్నారు. వీలైనంత వరకు ప్రజలు తమ ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కల్గించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లపై కేకులు కట్ చేస్తూ, డిజెలు, భారీ శబ్దాలు వచ్చే బాక్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, ప్రజలందరు నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.