పెట్రోల్ బంక్ సంఘటనలో సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు
పెట్రోల్ బంక్ సంఘటనలో సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దు
జగిత్యాల, డిసెంబర్,29
జగిత్యాల పట్టణంలో శుక్రవారము రోజున అర్ద రాత్రి బాంబే షాపింగ్ మాల్ పక్కన గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న సిబ్బంది పై దాడి చేస్తున్నారనే సమాచారం పై అక్కడికి వెళ్ళిన బ్లూ కొల్ట్ సిబ్బంది అయిన కానిస్తాబుల్ లు రాకేశ్ మరియు హోమ్ గార్డ్ విజయ్ కుమార్ లు అక్కడికి వెళ్ళగా వారి పై దురుసుగా ప్రవర్తించి మరియు బంక్ సిబ్బంది పై దాడి చేసిన నిందితులైన బోతుకాని శేఖర్ మరియు తుమ్మల గంగారం ల పై రెండు కేసులు నమోదు చేయనడం జరిగిందనీ టౌన్ సీఐ వేణుగోపాల్ ఒక ప్రకటనలోతెలిపారు. పెట్రోల్ బంక్ సిబ్బంది దాడి కేసు ఒకటి క్రైం.నెంబర్ . 811/2024 U/S 296(b), 115(2), 351(2) r/w 3(5) బీ ఎన్ ఎస్ మరియు ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి వారిపై కూడా దాడి చేసిన మరో కేసు క్రైం. నెంబర్. 810/2024 U/S 221, 132, 351(2) r/w 3(5) బీ ఎన్ ఎస్ ఈ సంఘటన పై ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు తావు లేకుండా నేరం చేసిన పైన తెలిపిన నింధితులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ , ఈ సంఘటన పై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని, ఎవరైన వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని టౌన్ సిఐ వేణుగోపాల్ తెలిపారు.