వినాయక చవితి హిందూ సంఘటన శక్తి

వినాయక చవితి హిందూ సంఘటన శక్తి


*వినాయక చవితి హిందూ సంఘటనా శక్తి సామాజిక' ఆర్థిక విప్లవం* 
--- నేడే వినాయక నిమజ్జనం 
( సెప్టెంబర్7- 17 ')
దశాబ్దాలుగా వినాయక చవితి పండుగ అన్ని వర్గాల వారు దేశవ్యాప్తంగా జరుపుకునే హిందువుల పర్వదినాల్లో  ప్రముఖమైంది.. 
*వినాయక చవితి చరిత్ర*
17 'శతాబ్దంలో "చత్రపతి శివాజీ "వినాయక చవితిని బహిరంగ ప్రదేశాల్లో జరిపారు. మరాఠా ప్రజలపై మొఘల్ రాజులదాష్టికాలకువ్యతిరేకంగా ప్రజలను కూడగట్టారు.

దేశ స్వతంత్ర కాంక్షను రగిలించడం కోసం బ్రిటిష్ బానిసత్వానికి వ్యతిరేకంగా యువతను ఏకం చేసేందుకు 1893లో మహారాష్ట్ర పూణే కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో కుల 'మతాలకు అతీతంగా అందరు
పాల్గొన్నారు.
*గణేష్ ఉత్సవాలు _జాతీయ స్థాయి గుర్తింపు*
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవానికి జాతీయస్థాయి గుర్తింపు తేవడంలో కీలకపాత్ర పోషించారు. క్రమేణా వినాయక నవరాత్రులు మహారాష్ట్ర సరిహద్దులు దాటి దేశమంతటా నిర్వహించడం  ఆనవాయితీగా మారింది.
*తిలక్ పిలుపు_ హైదరాబాదులో వినాయకుని వేడుకలు* * తిలక్ పిలుపుతో హైదరాబాదులో వినాయకుని వేడుకలు సిటీ పాత బస్తీ శాలిబండ దగ్గర ఉన్న గుణ వర్ధక్ సంస్థను 1895' ఉగాది రోజున స్థాపించారు. గుణ వర్ధక్ సంస్థ వినాయక ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించింది.
హైదరాబాదులో 1980సం" తర్వాత గణేష్ ఉత్సవాలు 
భాగ్యనగర్ గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించడం జరిగింది.
గణేష్ చతుర్థి నవరాత్రి పర్వదినాలలో తొమ్మిది రోజులపాటు మహాగణపతిని పూజించడం. భారతదేశంలో తరతరాలుగా వస్తున్న అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవం.లక్షలాది కుటుంబాల్లో  సంతోషాలు, సంబరాలు తీసుకొస్తుంది.వ్యక్తుల్లో ఆధ్యాత్మికత'  సమర్పణ భావం' దాన గుణం' భక్తి భావాన్ని ప్రకటించడానికి వినాయక చవితి  వేదికగా నిలవడం విశేషం.
*వినాయక చవితి _ ఆర్థిక విప్లవం* వినాయక చవితి పండగ ఆర్థిక వ్యవస్థలో విభిన్న ఆర్థిక కార్య కలాపాలకు  ఊతంగా నిలిచిందని చెప్పవచ్చు.ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి 'ఉత్పత్తి వినియోగం' పంపిణీ కార్యక్రమాలకు ఉద్దీపనంగా నిలిచిన ఓ ఆర్థిక విప్లవం అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. ఏటికాయేడు భారీగా వ్యాపారం జరిగే ఈ పండగకు..ఈసారి దేశవ్యాప్తంగా ఎంత మొత్తంలో బిజినెస్ జరుగుతుందో తెలుసా..? అక్షరాలా లక్ష కోట్ల రూపాయలని ఓ అంచనా. ఇంత భారీ వ్యాపారం జరిగే ఈ పండగ యొక్క ప్రత్యేకతలే కాదు.. విమర్శలు చేసేవారికి కూడా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.. 

*వినాయక చవితి సామాజిక ఉత్సవం* 
స్వాతంత్య్ర సాధనలో భాగంగా బాలగంగాధర్ తిలక్ వినాయక నవరాత్రులను సామూహిక' సామాజిక ఉత్సవంగా  జరిపే విధంగా రూపకల్పన చేసారు. అన్ని వయసుల వారు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు సామూహికంగా పాల్గొనే జాతీయ పండుగ.నాటి నుంచి నేటికీ కొనసాగుతోన్న ఈవేడుకలను సరిగ్గా పరిశీలిస్తే.. దాని వెనుక సమాజహితం  సంఘటనా శక్తి ' సామాజిక' సమరసత  భక్తి భావం కళ్లకు కడుతుంది. 
గణేష్ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలుభాగస్వాములు అవుతున్నారు. ప్రజలు వివిధ వస్తువులు సేవల ఉత్పత్తుల్లో పాల్గొంటున్నారు . వస్తువుల ఉత్పత్తులుసేవలు కొనుగోలు రావాణా ' సంగీతం ' విధ్ధీకరణ ' కూరగాయలు  వినాయక మంటపాల నిర్మాణం' అలంకరణ కార్యకలాపాల్లో  పాల్గొంటున్నారు.  దేశ జాతీయ ' సాంస్కృతిక ' వారసత్వ పండుగల్లో బడుగు 'బలహీన వర్గాలు వారు 'వనవాసీలు' మహిళలు 'ఏదో ఒక ఆర్థిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఆర్థిక కార్యక్రమాలైన పెట్టుబడి 'ఉత్పత్తి' వినియోగం 'పంపిణీ అనే రంగాల్లో పాలుపంచు కుంటున్నారు. కాబట్టి ఈ పండుగ *సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి*(Inclusive Development  Model) నమూనాకు ఒక ఉదాహరణగా పేర్కొవచ్చు.
*ప్రత్యక్ష 'పరోక్ష ఉపాధి కల్పన* వేల కుటుంబాలకు ప్రత్యక్ష  'పరోక్ష ఉపాది దొరుకుతుంది. ఆదాయాలు పెరిగి కొనుగోలు శక్తి జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
*కులవృత్తుల మనుగడ* 
ఎన్నో కులవృత్తులు సజీవంగా మనుగడ సాగిస్తుండటంలో.వినాయక చవితి పర్వదినానికి ప్రత్యక్ష పాత్ర ఉంది. రకరకాల పనులు చేసుకునే వారికి ఈ చవితి సిరి సంపదలను తీసుకొస్తుంది. 
*విగ్రహాల తయారీ ఉపాధి కల్పన*
ప్రతి కుటుంబంలో 3-15 మంది  విగ్రహాల తయారిలో కార్మికులుగా పనిచేస్తున్నారు. 
కొన్ని లక్షల మంది కార్మికులు 6 నుండి 10 నెలల పాటు ఉపాధి పొందుతున్నారు.ఎక్కువ మంది కార్మికులు వంశ పారంపర్యంగా 
విగ్రహాల తయారీలో కొనసాగుతున్నారు.
విగ్రహాలు వాటి డిజైన్ చేసే వారు, వారి సహాయకులు, రంగులు అమ్మేవారు, వాటిని వేసేవారు, మంటపాలు వేసే మేదరులు, మట్టిని అందించే కుమ్మరులకు పని దొరుకుతుంది. వీరితో పాటు.. పందిళ్ళు వేసేవారు, సన్నాయి, బ్యాండ్ మేళం వారికి, , బట్టలు కుట్టే వారికి పని లబిస్తుంది.వినాయక చవితి ఆర్థిక వ్యవస్థలో  ఉత్పత్తి వినియోగం ఆదాయ
సృష్టికి దోహదపడుతుంది.

*ఉద్యాన వన పంటలకు డిమాండ్ ఏర్పడుతుంది*
దేవుడి అలంకరణకు పూలు కావాలి కాబట్టి.. ఉద్యానవన పంటలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఉద్యానవన పంటలు పండించే రైతులకు ఈ కాలంలో  మంచి వ్యాపారం జరిగి వారికి ఆదాయం చేకూరుతుంది. అలాగే పూలు అమ్మేవాళ్ళు పూల దండలు అల్లేవారు, పూలతో అలంకరణ  చేసే వారికి డిమాండ్ ఉంటుంది. ప్రతీ మంటపంతో పాటు.. దాని ముందు వేసే రకరకాల విద్యుత్ దీపాల అలంకరణలు  కొత్త శోభను తీసుకొస్తుంది. 
*సన్నకారు రైతులకు ఆదాయం*
ఆయా వ్యాపారాలు చేసే వారికి ఈ సీజన్ మంచి గిరాకీ ఇస్తుంది. అలాగే కొబ్బరికాయలు, రకరకాల పళ్లు, పూజచేసే పత్రి, మామిడాకులు.. ఇలా వీటన్నింటీని పండించే సన్నకారు రైతులకు ఇదో మంచి సీజన్. సన్నకారు రైతులకు ఆర్థిక ఆసరా ఏర్పడుతుంది.వారి ఆదాయాలు పెరుగుతాయి.
*సాంస్కృతిక కళా ప్రదర్శనల పరిరక్షణ*
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతీ మంటపం దగ్గర.. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ప్రవచనాలు, సంగీత కచేరీలు, ఆర్కెస్ట్రాలు, కోలాటాలు, తోలుబొమ్మలాటలు.. ఇలా రకరకాల వృత్తులు, కళాకారులకు.. వారి వృత్తి కౌశలాన్ని పెంపొందించకునే అవకాశం కల్పిస్తుంది. చవితి వివిధ వర్గాల్లో సంబరాలు తీసుకొస్తుంది. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక' కళా ప్రదర్శనలు ఇచ్చే కళాకారులను ముందుగానే బుక్ చేసుకుని వారి కళా ప్రదర్శనలను పరిరక్షించడానికి వినాయక ఉత్సవాలు వేదికలుగా నిలవడం గమనారం. 
*సామూహిక భోజనాలు సామాజిక సామరస్యత*
దాదాపు ప్రతీ వినాయక మంటపంలో.అన్న సంతర్పణ జరుగుతుంది. భక్తులంతా కలిసి సాముహిక భోజనాలు చేస్తారు. సమాజంలో సమిష్టి భావన బలపడి  సామరస్యత పెరుగుతుంది. ఈ పండుగ సమయంలో వంట మనుషులకు, వారి సహాయకులకు, టెంట్ హౌజ్ లకు భలే గిట్టుబాటవుతుంది. 
*పురోహితులకు గౌరవం*
నవరాత్రుల్లో పూజలు చేసే పురోహితులు, బ్రాహ్మణ పండితులకు తగిన గౌరవం.. వినాయక చవితి ఇస్తుంది. తగిన సంభావణలతో వారు సంతోషంగా ఉంటారు. ఇక విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనాలు చేసే సమయంలోనూ.. ట్రాలీలు, లారీలు, ఇతర వాహనాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. చివరకు రోజూ వారీ కూలీలు సైతం.. ఈ చవితిలో ఎంతో కొంత సంపాదించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. 
*నవతరానికి సనాతన సాంప్రదాయం పరిచయం*
నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా.. వినాయక మంటపాల నుంచే అని చెప్పొచ్చు. 
*ఆర్థిక మాంద్యాన్ని  ఎదుర్కోవడంలో పండుగలే కీలక పాత్ర*
ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థికమాంధ్యం ఉచ్చులో చిక్కుకుంటున్నా.. మనదేశంలో అలాంటి కష్టాలు అంతగా లేక పోవడానికి ఇలాంటి పండగలు, పర్వదినాలే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పడంలో అనుమానాలు అక్కర్లేదు. దాదాపు ప్రతి పండగ సందర్భంగా వేల కోట్ల వ్యాపారం జరుగడం వల్ల రకరకాల కులవృత్తులు, వ్యాపారాలు చేసుకునే వారందరికీ ఈ పర్వదినాలు ఎంతో కొంత సంపదను 
సమకూరుస్తాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో మాంధ్యం అనే మాటే వినబడదు. 
 *సమభావం ఏర్పడుతుంది* వినాయక చవితి ఉత్సవాలలో అన్ని కులాలవారుఅన్నివర్గాలవారు భాగస్వాములౌతారు. కాబట్టి సామాజిక' సమత 'సమరసత సమానత భావం 'సమైక్యత ఐక్యత 'సౌబ్రాతృత్వం ఏర్పడుతుంది.
**వినాయక చవితి__ భక్తి*
*వసుదైక కుటుంబం**
ఇలా భక్తి పేరుతో వ్యావహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుధైక కుటుంబం అనే సిద్దాంతం దాగి ఉంది. మన సనాతన సాంప్రదాయాల మాటున ఉన్న లోకహితమైన, లోతైన రహస్యాలు..  మేధావులుగా చెలామణి అవుతున్న  సంకుచిత బుద్ధి కలిగిన వ్యక్తులు , కుహానా లౌకిక వాదులకు ఎప్పటికి అర్థం చేసుకుంటారో.జాతీయబావ వ్యాప్తికి  జాతి ఐక్యతకు ప్రతీకగా నిలిచిన వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం 
అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి.
ధర్మం 'సంస్కృతి స్థూలంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షిస్తున్నప్పటికీ ప్రభుత్వం తన విధిని మరిచిపోకూడదు. ప్రతి ఒక్కరి కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యక్రమాలకుప్రధానవాహికగా నిలిచిన గణేష్ విగ్రహాల తయారీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. విగ్రహాల తయారీ కార్మికుల కు కార్మిక మంత్రిత్వ శాఖ లేబర్ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. ప్రమాధ భీమా 'లైఫ్ ఇన్స్యూరెన్స్  సౌకర్యం కల్పించాలి . విగ్రహ తయారీ కార్మికులను ఆదుకొని వారి కళలను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.
 అదే విధంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వినాయక చవితిని జాతీయ పండుగగా గుర్తించి ఉత్సవాలను ప్రోత్సాహించాలి. విగ్రహల తయారులో కుమ్మరులకు హక్కులు కల్పించాలి. కుమ్మరులను ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలి. సహజమైన రంగులు వాడే విధంగా చర్యలు తీసుకోవాలి. 
మట్టి వినాయకులను  ప్రోత్సహించాలి . పర్యావరణాన్ని పరిరక్షించాలి
వినాయక చవితి పండుగల తోపాటు అన్ని పండుగలను పర్యావరణంకు హాని జరుగకుండా జరుపుకునేల చర్యలు తీసుకోవాలి. డి.జె'లు శబ్ద కాలుష్యం జరిపే వాటిని నిషేధించాలి. పండుగంటే సంతోషం కలిగించేది. పండుగల ద్వారా హాని జరుగరాదు. ప్రతి పండుగను గౌరవించాలి. మానవత్వం వెల్లివిరిసేల పండుగలను జరుపుకోవాలి. 

నేదునూరి కనకయ్య 
రాష్ర్ట అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం 
కరీంనగర్9440245771IMG-20240916-WA0022
Tags: