జాతీయస్థాయి పోటీలకు విద్యర్థుల ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
జగిత్యాల, అక్టోబర్,26
ఈ నెల 23 నుంచి 25 వరకు గద్వాల జిల్లా కేంద్రంలో జరిగినటువంటి 68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సంవత్సరాల బాలుర మరియు బాలికల తైక్వాండో ఛాంపియన్షిప్ మరియు సెలక్షన్స్ లో జగిత్యాల జిల్లా కేంద్రనికి చెందిన విద్యార్థు లు అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనారు. ఈ రోజు జరిగిన అభినందన సభలో జగిత్యాల జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ లక్ష్మీ రామ్ నాయక్ మరియు జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ మంచాల కృష్ణ అధ్యక్షులు కోలా గంగారం ప్రధాన కార్యదర్శి మరియు కోచ్ గందె సంతోష్ , ఉపాధ్యక్షులు రమేష్ అభినందించారు. ఈ పోటీలలో బాలికల 63 కేజీ విభాగంలో అభ్యాస స్కూల్ విద్యార్థిని బి లాస్య ప్రియ , బాలుర 59 కేజీల విభాగంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధరూర్ స్కూల్ విద్యార్థి ఎస్. మహేష్ గోల్డ్ మెడల్ సాధించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు నవంబర్ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశా జిల్లాలో జరిగే 68 వ జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొంటారని జగిత్యాల జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ లక్ష్మీ రామ్ నాయక్ ఒక ప్రకటన తెలిపారు .