డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డుకున్న సిద్దిపేట ఎసిపి మరో ముగ్గురు పై కేసు నమోదు
ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన సిద్దిపేట ఏసీపీ, మరో ముగ్గురిపై కేసు నమోదు
హైద్రాబాద్, నవంబరు 14
ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన సిద్దిపేట ఏసీపీతోపాటు మరో ముగ్గురిపై మధురానగర్ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్సార్‌నగర్ ట్రాఫిక్ పీఎస్ ఎస్సై కాంతారావు తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి 11.30 గంటలకు మైత్రీవనం నుంచి ఎస్సార్‌నగర్ వైపునకు ఓ కారు వచ్చింది. ట్రాఫిక్ పోలీసులను చూసి డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి పక్కసీటులోకి మారారు. ఇది గమనించిన మహిళా కానిస్టేబుల్.. ఎస్సై కాంతారావుకు తెలిపింది.
ఆయన డ్రెవింగ్ చేసిన వ్యక్తిని బ్రీత్ అనలైజర్‌లో ఊదమని కోరగా.. ఊదనని చెప్పాడు. అప్పుడు ఎస్సై వద్దకు వచ్చిన సుమన్‌కుమార్ తాను సిద్దిపేట ఏసీపీనని, కేసు లేకుండా పంపాలని సూచించారు. కాంతారావు కుదరదనడంతో ఏసీపీ సుమన్‌కుమార్ ఆవేశంతో ఆయన్ను నెట్టడంతోపాటు కారులో ఉన్నవారం తా కలిసి న్యూసెన్స్ చేశారు. ఈ మేరకు ఏసీపీతోపాటు డ్రైవర్ ఎన్.జైపాల్‌రెడ్డి, కారులో ఉన్న ఎన్.శ్రీనివాస్, జి.వెంకట్‌రావుపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.