గ్రూప్ 3 పరీక్ష కు పటిష్ట బందోబస్తు అదనపు ఎస్పీ భీమ్ రావు
*గ్రూప్ - 3 పరీక్ష కు పటిష్ట బందోబస్తు - -
జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు*
*పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ ( 144 సెక్షన్) అమలు*
*అభ్యర్థుల సందేహాలను నివృతం చేయడానికి మూడు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు*
*220 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు.*
చురకలు విలేఖరి
జగిత్యాల, నవంబర్,16
ఆదివారం, సోమవారం నిర్వహించే గ్రూప్- 3 పరీక్షల సందర్భంగా పరీక్ష జరిగే కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు ఎస్పీ భీమ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో గల దేవిశ్రీ గార్డెన్లో నందు సిబ్బందికి చేయవలసిన విధులపై మార్గ నిర్దేశం పై ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య గ్రూప్ -3 పరీక్షను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్య అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి జిల్లా కేంద్రంలో మూడు హెల్ప్ డెస్క్ లు కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, చిన్న కెనాల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా అభ్యర్థులు సెంటర్ ల యొక్క వివరాలు, ఆలస్యమైన అభ్యర్థులను సెంటర్లకు చేర్చడానికి వీలుగా ప్రతి హెల్ప్ డెస్క్ దగ్గర రెండు వాహనాలు సిద్ధంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల నందు 10,656 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యాలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఏర్పాటు చేసిన రూట్లలో సీఐ స్థాయి అధికారి ఇన్చార్జి గా ఉంటూ, ఎస్ఐ స్థాయి అధికారి ద్వారా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంల వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. మహిళ అభ్యర్థులకు ప్రత్యేకంగా మహిళా సిబ్బంది ద్వారా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యల తలెత్తకుండా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ద్వారా బందోబస్తు చర్యలను చేపడుతున్నట్లు తెలియజేశారు.ఎలాంటి అత్యవసరం సమయంలోనైనా అభ్యర్థులు డయల్-100 ద్వారా పోలీసు యంత్రాంగం సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. పరీక్షా పత్రాల మరియు జవాబు పత్రాల తరలింపులో ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు సూచించబడిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి ముందే చేరుకునేలా ఉండాలని, పరీక్షా కేంద్రంలో విధుల నిర్వర్తించే ప్రతి ఒక్క వ్యక్తి కచ్చితంగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని లేని వారిని లోనికి అనుమతించడం జరిగినది తెలిపారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతము 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు గూమికూడి ఉండకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రం 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సెల్ ఫోన్ లను, చేతి గడియారాలను, క్యాలిక్యులేటర్లను అనుమతించడం జరగదని అభ్యర్థులు గమనించి ముందు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు రవీంద్ర కుమార్, రఘు చందర్, రాములు, సి.ఐలు, ఎస్సైలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.