సిఐ, ఎస్ఐ లను సన్మణించిన ఎమ్మేల్యే
By: Mohammad Imran
On
అధికారులను సన్మానించిన ఎమ్మెల్యే.
చురకలు విలేకరి, కొడిమ్యాల, నవంబర్ 18: నాచుపల్లి - కొండగట్టు మార్గమధ్యలో ప్రమాదకరంగా ఉన్న బావిని ఇటీవలే గమనించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బావిని వెంటనే పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం బావి పూడ్చివేత పనులు పూర్తికాగా, బావి పూడ్చివేత పనులకు సహకరించిన బావి యజమాని, మల్యాల సిఐ నీలం రవి, ఎస్ఐలు సౌడం సందీప్, నరేష్ లను సోమవారం ఎమ్మెల్యే సత్యం అభినందించి శాలువాలతో సన్మానించారు. బావి పూడ్చివేతకు సహకరించిన యజమానికి తనవంతుగా బోర్ వేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ గడ్డం జీవన్ రెడ్డి, నాయకులు గాజుల శంకర్, గోల్కొండ రాజు, అంజాగౌడ్, తిరుమలేష్, అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: