గ్రూప్ 3 అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ల ఏర్పాటు
గ్రూప్ 3 అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ల ఏర్పాటు
చురకలు విలేఖరి
జగిత్యాల, నవంబర్,17
తెలంగాణ ప్రభుత్వం TGPSC నిర్వహిస్తున్న గ్రూప్- 3 ఎగ్జామ్ వ్రాయడానికి రానున్న అభ్యర్థులకు జగిత్యాల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల ఎస్. డి.పి. ఓ. డీ. రఘు చందర్ గ్రూప్- 3 పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పట్టణంలో ప్రధాన కూడళ్లలో పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ,చిన్న కెనాల్ చౌరస్తా వద్ద హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆలస్యం అయితే వారిని ఎగ్జామ్స్ సెంటర్స్ కి తొందరగా తీసుకెళ్లడానికి, ముఖ్యంగా వికలాంగులు, స్త్రీల కు ఉచితంగా ఆటోలను అందుబాటులో ఉంచడం జరిగిందనీ జగిత్యాల టౌన్ సిఐ ఎస్ వేణుగోపాల్ తెలిపారు. హెల్ప్ డెస్క్ వద్ద కానిస్టేబుల్స్ ఉండి వచ్చిన అభ్యర్థులకు కాలేజ్ లేదా స్కూల్స్ అడ్రస్ తెలిపే విధంగా అందుబాటులో ఉంచడం జరిగిందనీ ,జగిత్యాల పట్టణంలోకి వచ్చే గ్రూప్- 3అభ్యర్థులు ఈ అవకాశం వినియోగించుకొని పరీక్షకు సకాలంలో హాజరై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసు కొవాలని జగిత్యాల టౌన్ సిఐ ఎస్ వేణుగోపాల్ తెలిపారు.