ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
చురకలు విలేఖరి
జగిత్యాల
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన న్యాయబద్ధమైన హామీలను వెంటనే అమలుచేయాలని ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు, ఇందులో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినప్పటికి ఇంతవరకు ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యాచరణ చేపట్టకుండా నిర్లక్ష్యం వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, మేము అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లలో ఉద్యమకారులకు ఒక కాలం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైన ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, బస్ పాస్ సౌకర్యంతో పాటు 250 గజాల నివాస స్థలం కేటాయించాలనే ప్రధాన డిమాండ్లు నెరవేర్చే దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగెల రవింధర్ రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ నక్క గంగాధర్, ఉద్యమ నాయకులు చింతల గంగాధర్, జగిత్యాల మండల అధ్యక్షులు లైశెట్టి కిషన్, మల్యాల మండల కార్యదర్శి జుట్టు శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు తన్నీరు సత్యనారాయణ రావు, జిల్లా కోశాధికారి పల్లపు చిన్నారెడ్డి, రాయికల్ మం,, అధ్యక్షులు కోల రాజు, సారంగాపూర్ మం,, అద్యక్షులు ఉరుమండ్ల రాజేందర్ రెడ్డి, భీర్పూర్ మం,, అద్యక్షులు జక్కుల చంద్రయ్య యాదవ్, మల్యాల మం,, అద్యక్షులు జవ్వాజి తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.