గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు

వివరాలు వెల్లడించిన జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్

చురకలు ప్రతినిధి, జగిత్యాల, నవంబర్ 3 : జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారంతో ఆదివారం పట్టణంలోని బైపాస్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ముగ్గురు యువకులు ఓ స్కూటీలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని
తెలిపారు. నిందితులైన బాలెపల్లి గ్రామానికి జక్కుల మధు, వెంగళాయిపేటకు చెందిన రాచర్ల వంశీ, కుక్కలగూడురు గ్రామానికి చెందిన నలిమెల వినోద్లను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. తక్కువ ధరకు ఇతర ప్రాంతాల నుండి గంజాయిని తీసుకవచ్చి పట్టణం, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు. రాచర్ల వంశీపై గతంలో రెండు గంజాయి కేసులు నమోదు అయ్యాయని, నలిమెల వినోదపై గతంలో ఏడు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. గంజాయి తరలించినా, విక్రయించినా, సేవిస్తూ పట్టుబడిన చట్టప్రకారం
కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి విక్రయిస్తున్న వారి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.IMG-20241103-WA0018

Tags:

Related Posts