బల్మూరి నారాయణరావు సహచరిణి నిర్మల ఎలియాస్ రాజే అరెస్ట్!

బల్మూరి నారాయణరావు సహచరిణి నిర్మల ఎలియాస్ రాజే అరెస్ట్!

బల్మూరి నారాయణరావు సహచరిణి
నిర్మల ఎలియాస్ రాజే అరెస్ట్!

*మద్దేడులో కొనసాగుతున్న ఎన్కౌంటర్, ఐదుగురు మావోల మృతి! 

జగిత్యాల  ప్రతినిధి:
బీర్పూర్ గ్రామ నివాసి మావోయిస్టు పార్టీ అగ్రనేత బల్మూరి నారాయణరావు సహచరిణి నిర్మల ఉరఫ్ రాజే ఆదివారం చతిస్గడ్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. రాజే అరెస్టు వార్తలపై ప్రచారం జరుగుతుంది. గత రెండు వారాల క్రితం బలమురి నారాయణరావు అరెస్ట్ అయింది విధితమే. మావోయిస్టు పార్టీలో ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న నిర్మల అనూహ్యంగా పోలీసులకు పట్టుబడ్డారు. నారాయణరావు సహచరిణిగా ఉద్యమంలోనే పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ నాయకురాలు తిరిగి రెండు వారాలకు అరెస్ట్ కావడం వెనుక ఆమె కదలికలపై పోలీసులునిఘ పెట్టి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే బీజాపూర్ జిల్లా మద్దెడు ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ కొనసాగుతుంది ఉదయం ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు అయితే తిరిగి సాయంత్రం ఐదు మృతదేహాలు లభించాయని పోలీసు అధికారులు వెల్లడించారు ఈ జనవరి నుండి ఇప్పటివరకు 11 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారు అయితే మావోయిస్టులు మందు పాతర పేల్చి 9 మంది జవాన్లను మట్టు పెట్టిన తర్వాత ప్రతికారంతో పోలీసు బలగాలు అడవిని జల్లెడ పడుతుండగా ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్నది మరోవైపు ఛత్తీస్గఢ్లో వివిధ జిల్లాల్లో శనివారం 9 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు.IMG-20250112-WA1453

Tags: