ఎమ్మెల్సీ కవితను కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు
By: Mohammad Imran
On
ఎమ్మెల్సీ కవితను కలిసిన బిఆర్ఎస్ నాయకులు.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 17 : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను శుక్రవారం హైద్రాబాద్లోని ఆమె నివాసం పలువురు జగిత్యాల బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు నాయకులు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర, సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జాగృతి నాయకులు సైఫోద్దీన్, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ ఆసీఫ్, నాయకులు జహంగీర్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
Tags: