మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వ్యక్తి అరెస్ట్

మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వ్యక్తి అరెస్ట్

మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వ్యక్తి అరెస్టు

వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్..

చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 13 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మహిళల ఫోటోలను దొంగచాటుగా చిత్రీకరించి సోషల్మీడియాలో పోస్టు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. సోమవారం డిఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ పెగడపల్లి మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన బండారి శ్రవణ్ అనే వ్యక్తి జగిత్యాల పట్టణంలోని బస్టాండ్, మార్కెట్లాంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల ఫోటోలను దొంగచాటుగా చిత్రీకరించి థైస్ అండ్ లెగ్గిన్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడీలో అసభ్య పోస్టులు పెడుతూ మహిళలను ఇబ్బందులకు గురి చేస్తుండగా, ఇటీవలే జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడి ఫోన్లో వేల సంఖ్యలో మహిళల ఫోటోలు, విడియోలు లభించాయని, నిందితుడిపై కేసు నమోదు చేసి ఐడీని బ్లాక్ చేయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250113-WA1152

Tags: