దారిదోపిడికి పాల్పడిన నిందితుల అరెస్ట్

దారిదోపిడికి పాల్పడిన నిందితుల అరెస్ట్

దారి దోపిడికి పాల్పడిన నిందితుల అరెస్టు.

10 గంటల్లోగా కేసును చేధించిన పోలీసులు.

వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 17: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లి చౌరస్తా వద్ద దారి దోపిడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి చెందిన దుర్గం సాయిబాబా అనే వ్యక్తి గురువారం రాత్రి తన పని ముగించుకొని ద్విచక్రవాహనం తన నివాసానికి వెళ్తున్న క్రమంలో గోవిందుపల్లి చౌరస్తా వద్ద ఇద్దరు దుండుగులు
దుర్గం సాయిబాబాను అడ్డగించి చంపుతామని బెదిరించి, అతని వద్ద గల సెల్ఫోన్, నగదును ఎత్తుకెళ్లారు. సాయిబాబా ఫిర్యాదు మేరకు స్పందించి జగిత్యాల పట్టణ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను 10 గంటల్లోనే పట్టుకొని కేసును చేధించారన్నారు. నిందితులైన పోచంపల్లి శంకర్, సిరికొండ నరేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. దారి దోపిడి కేసును కేవలం 10 గంటల్లోనే చేధించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పీ రఘుచందర్లు అభినందించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్ఐలు మన్మధరావు, గీత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250117-WA0004

Tags: