దాడికి యత్నించ్చిన వ్యక్తి పై కేసు నమోదు
By: Mohammad Imran
On
దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు.
చురకలు విలేకరి, జగిత్యాల, జనవరి 13: జగిత్యాల పట్టణం ఇస్లాంపురకు చెందిన షేక్ సల్మాన్ అనే యువకుడిపై దాడికి యత్నించిన నడిమింటి విజయ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల పట్టణ ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం షేక్ సల్మాన్ ను ఆదివారం రాత్రి నడిమింటి విజయ్, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు పాత గొడవలను మనస్సులో పెట్టుకొని ఫోన్ చేసి కృష్ణనగర్ వద్దకు పిలిచి, కళ్లలో కారం పొడి కొట్టి కత్తితో దాడికి యత్నించారన్నారు. బాధితుడు సల్మాన్ తన స్నేహితుడి సహాయం అక్కడి నుండి పారిపోయి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడని, సల్మాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి ఎ1 నడిమింటి విజయ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
Tags: