ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన నిందితుల అరెస్టు

ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన నిందితుల అరెస్టు

ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు.

మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం.

వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 17 : జగిత్యాల జిల్లాలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్
స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని చిన్నకెనాల్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో ఎండి. ఆమేర్ అనే వ్యక్తి నంబర్
ప్లేట్ ద్విచక్రవాహనం వెళ్తుండగా పోలీసులు వాహనపత్రాలు చూపించాలని కోరగా, అతను తడబడుతూ అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు ఆమేర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆమేర్ను విచారించగా జిల్లా కేంద్రంలో మూడు చోట్ల ద్విచక్రవాహనాలను చోరి చేసినట్లు ఒప్పుకున్నాడని, నిందితుడి వద్ద నుండి మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోని, రిమాండ్ తరలించినట్లు డిఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్ఐలు మన్మధరావు, గీత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250117-WA0005

Tags: