క్రీడలు పోలీసులకు ఉత్సాహాన్ని కల్గిస్తాయి జిల్లా జడ్జి నీలిమ

క్రీడలు పోలీసులకు ఉత్సాహాన్ని కల్గిస్తాయి జిల్లా జడ్జి నీలిమ

IMG-20250117-WA0001విధుల్లో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సహాన్ని కల్గిస్తాయి. 

జిల్లా న్యాయమూర్తి నీలిమ 

ముగిసిన పోలీస్ స్పోర్ట్స్ మీట్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 17 : అనునిత్యం విధుల్లో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సహాన్ని కల్గిస్తాయని జిల్లా న్యాయమూర్తి నీలిమ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ గత రెండు రోజులు జరుగుతున్న మూడవ వార్షిక క్రీడ పోటీల ముగింపు వేడుకలను జిల్లా న్యాయమూర్తి నీలిమ, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు హజరై జ్యోతి
ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి నీలిమ మాట్లాడుతూ ఎంతో పని ఒత్తిడితో బాధ్యతయుతంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు స్పోర్ట్స్ మీట్ వల్ల మరింత ఉత్సహాంతో విధులు నిర్వర్తించవచ్చన్నారు. మంచి ఆరోగ్యమే ఒక సంపద అని, మంచి ఆరోగ్యం లభించాలంటే క్రీడలతోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని, ప్రతి ఒక్కరు క్రీడ స్ఫూర్తితో ఈ క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతి రోజు విధులు
నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఆడవిడుపుగా ఇలాంటి క్రీడ పోటీలు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయన్నారు. పోలీస్ విధుల్లో ఒత్తిడి నుండి బయటపడటానికి, శారీరక ధృడత్వాన్ని
కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. అనంతరం క్రీడ పోటీల్లో విజేతలకు నిలిచిన వారికి జిల్లా జడ్జి నీలిమ, జిల్లా ఎస్పీ అశోక్కుమార్లు ట్రోఫీలు అందించి అభినందించారు. స్పోర్ట్స్ మీట్ను నిర్వహించడానికి కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ భీమ్రావు, డిఎస్పీలు, అధికారులు, పీఈటీలను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీలు రఘుచందర్, రాములు, రంగారెడ్డి, ఏవో శశికళ, డిసిఆర్బి, ఎస్బి, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, రఫీక్ ఖాన్, సీఐలు రాంనర్సింహారెడ్డి, వేణుగోపాల్, నీలం రవి, వై.కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి, సురేష్ బాబు, ఆర్విలు కిరణ్కుమార్, రామకృష్ణ, వేణు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: