సెల్ టవర్ ఏర్పాటును నిలిపివేయాలి
By: Mohammad Imran
On
సెల్ టవర్ ఏర్పాటును నిలిపివేయాలి.
చురకలు విలేకరి, జగిత్యాల, జనవరి 17: జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర కాలనీలో ఓ ఇంటిపై ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ను ఏర్పాటు చేయవద్దని కాలనీవాసులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సెల్ టవర్ ఏర్పాటుకు ప్రయత్నించడంతో కాలనీవాసులు అభ్యంతరం తెలిపినా ఇంటి యాజమాని
పట్టించుకోకుండా దొంగచాటున సెల్ టవర్ ఏర్పాటుకు ప్రయత్నించడంతో కాలనీవాసులు ఆందోళనకు చేపట్టారు. సెల్ టవర్ నుండి వచ్చే రేడియేషన్తో ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే సెల్ టవర్ ఏర్పాటును నిలిపివేయాలని ప్రజావాణిలో కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు. కాలనీవాసులు ఆందోళనతో స్పందించిన మున్సిపల్ అధికారులు సెల్ టవర్ పనులను నిలిపివేయడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు.
Tags: