రెండు బైక్ లు ఢీకొని ముగ్గురు మృతి సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పి అశోక్ కుమార్
By: Mohammad Imran
On
రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి..
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల ప్రతినిధి, జనవరి, 10
జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై తక్కలపల్లి అనంతరం మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు., ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ కు చెందిన అరవింద్, బత్తుల సాయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు వంశీని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వారం రోజుల క్రితం వంశీ గల్ఫ్ నుండి వచ్చి తిరుపతి వెళ్లి వచ్చాడు. తిరుపతి ప్రసాదం ఇచ్చి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.కాగా ప్రమాద సంఘటనా స్థలాన్ని జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్, డిఎస్పి రఘు సందర్శించారు.
Tags: